Dogs: బాలికపై దాడికి యత్నించిన కుక్కలు.. రామ్ గోపాల్ వర్మ ఫైర్.. వైరల్ అవుతున్న వీడియో..

రాష్ట్రంలో వీధి కుక్కల బెడద పెరిగిపోయింది. వీధి కుక్కల వల్ల ప్రాణాలే పోతున్నాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ అంబర్ పేటలో బాలుడిపై కుక్కలు దాడి చేసిం చంపాయి. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇందకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

దీంతో హైదరాబాద్ జనం రాత్రి పూట ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో కుక్కలను అదుపు చేయాలని జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వచ్చాయి. అయితే తాజాగా ఓ బాలికపై కుక్కలు దాడి యత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వీడియోలో ఓ బాలిక ఏదో వస్తువు పట్టుకుని వెళ్తోంది. ఆ బాలికపై రెండు కుక్కలు దాడి చేయడానికి ప్రయత్నించాయి. బాలిక ప్రతిఘటించినా అవి మీదికి వచ్చాయి. అయితే అక్కడే ఓ పెద్దాయన అక్కడికి చేరుకుని కుక్కలను వెళ్లగొట్టి బాలికను రక్షించాడు. 

ఈ వీడియోను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ జీహెచ్ఎంసీ త్వరగ మేల్కొండి అని ట్వీట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ అంబర్ పేటలో బాలుడు చనిపోయినప్పుడు కూడా తీవ్రంగా స్పందించారు. కుక్కలను అరికట్టడంలో జీహెచ్ఎంసీ విఫలమైందంటూ విమర్శించారు. 



కామెంట్‌లు